బిగ్‌బాస్‌లోకి సామ్రాట్ తల్లి సర్‌ప్రైజింగ్ ఎంట్రీ.. అసలు విషయం ఏమిటో చెప్పేసింది!

0
614

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం హాట్ ఫెవరెట్ గేమ్‌ షోగా బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. బిగ్ బాస్ సీజన్‌ 2ని నాని హోస్ట్ చేస్తుండటంతో ఈ షోపై మొదట ఆడియెన్స్‌లలో ఆదరణ తక్కువయినా క్రమంగా షో మాంచి కిక్ ఇస్తుండటంతో ప్రేక్షకులు బిగ్‌బాస్ సీజన్‌ 2ను ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తున్నారు. ఇదంతా కేవలం షోలో ఉన్న కంటెస్టెంట్స్ వల్లనే అని కొందరు అంటుంటే నాని హోస్టింగ్‌లో మార్పుతో ఇదంతా జరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఇక మనం అసలు విషయానికి వస్తే.. ఈ వారం బిగ్‌బాస్ హౌజ్ చాలా ఎమోషనల్‌గా మారింది.

బిగ్ బాస్‌షో మొదలయ్యి 90 రోజులకు పైగా కావడంతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ప్రతి కంటెస్టెంట్ కుటుంబ సభ్యులను బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించి అదిరిపోయే షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో తొలుత హౌజ్‌లోకి ఎంట్రి ఇచ్చారు సామ్రాట్ అమ్మగారు జయా రెడ్డి. ఫ్రీజ్ అండ్ రిలీజ్ టాస్క్‌‌తో కంటెస్టెంట్స్‌ను బిజీగా పెట్టిన బిగ్‌బాస్ ఇంటిలోనికి జయారెడ్డి రాక కొత్త అనుభూతిని తీసుకొచ్చింది. ఇంటి సభ్యులను ఫ్రీజ్ మోడ్‌లో పెట్టాక జయా రెడ్డి, ఇంటిలోకి వచ్చి వెనుకనుండి సామ్రాట్‌ను కౌగిలించుకుంది. ఆ సమయంలో వారిద్దరి కళ్ళలో తల్లీకొడుకుల ప్రేమను చూసి ప్రేక్షకులు చాలా సంతోషించారు.

జయా రెడ్డి గారు ఇంటి పార్టిసిపెంట్స్‌ను అందరినీ చాలా ప్రేమగా, అప్యాయంగా పలకరించడంతో ఒక్కసారిగా ఇంటి వాతావరణం మారిపోయింది. ఇన్నిరోజులుగా ఏదో ఒక విషయంలో గొడవపడుతూ వచ్చిన కంటెస్టెంట్స్ ముఖాల్లో చెప్పలేని ఆనందం కనిపించింది. మొదట సామ్రాట్‌ను రిలీజ్ చేయగానే అతడు తల్లిని ప్రేమతో కౌగిలించుకున్న దృశ్యం చూసి చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక అందరినీ రిలీజ్ చేసిన తరువాత ప్రతి ఒక్కరు ఆమె కాళ్ళకు నమస్కారం చేస్తూ ప్రేమగా కౌగిలించుకోవడంతో బిగ్ బాస్‌ సీజన్‌ 2లోనే ఇది బెస్ట్ ఎపిసోడ్‌గా నిలిచిందని చెప్పొచ్చు.

సామ్రాట్‌తో చాలా సేపు మాట్లాడిన జయారెడ్డి ఇంటిసభ్యులతో సామ్రాట్ చాలా బాగా ఉంటున్నాడని.. అతడు అలా ఉంటాడని వారు అస్సలు అనుకోలేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తన కొడుకు ఇలాంటి వాడు అని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం లేకుండా బిగ్ బాస్ చేశాడని.. ఆమె చాలా సంతోషంగా ఉందని తెలిపింది. బిగ్‌బాస్‌లోకి సామ్రాట్ ఎందుకు వచ్చాడో ఆ లక్ష్యం తీరిపోయిందని.. ఇక అతడు బిగ్‌బాస్‌లో గడిపే ప్రతి రోజు బోనస్ కిందకే అని ఆమె చెప్పింది. అతడు ఇంత స్ట్రాంగ్‌గా ఉంటాడని తాను అస్సలు అనుకోలేదని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. టైటిల్ గెలుపు సామ్రాట్ అదృష్టానికి సంబంధించిందని ఆమె ధైర్యాన్ని నింపింది.
ఇక ఆ తరువాత ఇంటి సభ్యులతో కూడా సామ్రాట్ తల్లిగారు చాలా బాగా మాట్లాడారు. కంటెస్టంట్స్‌ అందరితో ఆమె ఆప్యాయంగా మాట్లాడటం.. ముఖ్యంగా తనీష్ మరియు కౌషల్‌పై ఆమె చూపిన ప్రేమ నిజంగా అద్భుతం. తన తల్లిని గుర్తుకుచేసుకుని బాధపడ్డ కౌషల్‌ను చూసి తాను చాలా బాధపడ్డానని.. తను కూడా కౌషల్ తల్లిలాంటి దానినే అంటూ కౌషల్‌కు చెప్పడంతో ఒక్కసారిగా హౌజ్ ఎమోషనల్‌గా మారింది. ఇదే క్రమంలో కేరళ వరద బాధితులకు సామ్రాట్ చేసిన సహాయం గురించి కూడా చర్చ జరిగింది. అందరూ ఫైనల్స్‌కు రావాలని ఆమె కోరుకుంది. ఇంతలో బిగ్‌బాస్ ఆమెను హౌజ్‌ నుండి వెళ్లాల్సిందిగా ఆర్డర్ వేశాడు. మొత్తానికి సామ్రాట్ అమ్మగారు బిగ్‌బాస్ ఇంటికి రావడం నిజంగా సామ్రాట్‌కే కాదు ఇంటి సభ్యులకు కూడా పెద్ద బూస్ట్ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here