కేరళ వరద బాధితులను ఆదుకున్న సామ్రాట్

0
201

కేరళ వరద బాధితులను బిగ్‌బాస్‌లా ఆదుకున్న సామ్రాట్

Bigg Boss Contestant Samrat Helps Kerala Floods Victims

Samrat, Bigg Boss, Telugu Bigg Boss, Nani, Kaushal

తెలుగు టీవీ ఛానెల్స్‌లో ప్రస్తుతం టాప్ షోగా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్‌ అనే చెప్పాలి. ఈ షో టెలివిజన్ చిరిత్రలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ షో రెండో సీజన్‌ నుడుస్తోంది. ఇప్పటికే మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా తాజా సీజన్‌ను నాని హోస్ట్ చేస్తున్నాడు. కాగా ఈసారి ఈ షో నిర్వాహకులు అప్పుడే విజేతను నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ షోకు సంబంధించిన వార్తల ప్రకారం, రెండో సీజన్ విజేతను అప్పుడే డిసైడ్ చేశారట షో నిర్వాహకులు. ఈ సీజనల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కౌశల్ ఈసారి విజేతగా నిలవడం ఖాయం అని తెలుస్తోంది. అయితే సామ్రాట్ మాత్రం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో విజేతగా నిలిచాడు. షో మొదలయినప్పట్నుండీ సామ్రాట్ తనదైన ఆటతీరును ప్రదర్శిస్తూ సత్త చాటుతున్నాడు. మొదటి రెండు వారాల వరకు సైలెంట్‌గా ఉన్నా ఆ తరువాత తానంటే ఏమిటో ఇంటి సభ్యులకు తెలియజేశాడు. మిగతా వారితో పోల్చినట్లయితే సామ్రాట్ చాలా తక్కువసార్లు నామినేట్ అయ్యాడు.

ఇదే సామ్రాట్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌లా మారింది. సామ్రాట్ ఆట తీరును కనిపెడుతున్న ఆడియెన్స్, అతడు చూపించిన మార్పును బాగా యాక్సెప్ట్ చేశారు. కౌశల్ ఒక్కడినే అంటూ ఇంటిలో ఎంత పెద్ద గొడవ చేసినా సామ్రాట్ మాత్రం సైలెంట్‌గా ఉంటూ తన పని తాను కానిచ్చేశాడు. అయితే టాప్-5లో సామ్రాట్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల బీభత్సానికి అందరూ తమకు తోచినంత డొనేట్ చేశారు. అయితే బిగ్ బాస్ హౌస్‌ నుండి చాలా భారీ మొత్తం ఈ వరదల కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సామ్రాట్ కూడా ఆపదలో ఉన్నవారి కోసం తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు సామ్రాట్‌కు వచ్చిన రెమ్యునరేషన్‌లో భారీ మొత్తం కేరళ వరద బాధితులకు ఇచ్చాడట సామ్రాట్. ఇలా తన పెద్ద మనసు చాటుకున్న సామ్రాట్‌కు అటు బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు ప్రేక్షకులు కూడా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తన తోటి కంటెస్టంట్స్‌కు స్ఫూర్తినిచ్చాడు సామ్రాట్.

 

తాను రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు సామ్రాట్. బిగ్ బాస్ హౌజ్‌లో అందరి మనసులు గెలుచుకున్న సామ్రాట్ మరి బిగ్ బాస్ గేమ్‌షోలో ఎలాంటి విజయం సాధించాడో తెలియాలంటే మాత్రం బిగ్ బాస్ గేమ్ చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here